నిర్మల్: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో ప్రత్యేక ఆలయ అర్చకులు పూజలు, కుంకుమార్చనలు చేస్తున్నారు. చిన్నారులకు అక్షర శ్రీకారం పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa