ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల డబ్బుతో నగలు ఇవ్వటం అనైతికం : సురంవరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 11:48 PM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రజల డబ్బుతో నగలు ఇవ్వటం అనైతికమని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురంవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సెక్యులర్‌ వ్యవస్థలో నమ్మకాలకి అతీతంగా నడవాల్సిన ప్రభుత్వం ఇటువంటి పనులు చేయడం తగదన్నారు. అలాగే దేవుడి పేరుతో ఖర్చు పెడితే చర్చ తప్పకుండా చేస్తామన్నారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ కుటుంబాన్నే తప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లని ఎందుకు తీసుకెళ్లలేదని సురంవరం ప్రశ్నించారు. అలాగే కమ్యూనిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఉన్నారన్న కేసీఆర్‌ మాటలను ఖండిస్తున్నామని, కేసీఆర్‌ మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa