హైదరాబాద్, మేజర్‌న్యూస్: బీజేపీ మాజీ అధ్యక్షుడు దివంగత నేత బంగారు లక్ష్మణ్ మహా అధ్యయనశీలి అని, ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బంగారు లక్ష్మణ్ 3వ వర్దంతి సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఆయన స్పూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాంచంద్రారెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు టి.రాజేశ్వర్‌రావు, ధర్మారావు, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్ రెడ్డి, ఎస్.కుమార్ వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa