ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవిష్యత్తు అంటే ఉద్యోగమొక్కటే కాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 11:59 PM

-బోలెడన్నీ అవకాశాలున్నాయి
-సృజనాత్మకంగా ఆలోచించాలి 
-అవకాశాలు, సంపద వాటంతటే అవే వస్తాయి 
-సికింద్రాబాద్‌ పీజీ కాలేజీ వార్షికోత్సవసభలో మంత్రి ఈటల

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : యువత భవిష్యత్‌ అంటే ఉద్యోగమే అనే ఉద్దే శంతో ఉందని, ఆ ఆలోచన సరళి మారాల్సిన అవసరం ఉందని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.   మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే బోలెడన్ని అవకాశాలు మన కోసం ఎదురుచూస్తున్నాయని, వాటిని అందిపు చ్చుకోవాలంటే  సృజనాత్మకంగా  ఆలోచించడమే మార్గమని చెప్పారు. విద్యా ర్థులు, యువత సృజనాత్మకంగా  ఆలోచిస్తే అవకాశాలు, సంపదతో కూడిన మరో ప్రపంచం వారిని ఆహ్వానిస్తుందన్నారు. సికింద్రాబాద్‌ ఓయూ పీజీ కళాశాల 70వ వార్షికోత్సవ వేడుకకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ  రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం ఇలా ఎన్నో రంగాలు నవ తరానికి అవకాశాలు కల్పిస్తు న్నాయని చెప్పారు. సమాజంలో గొప్పవాళ్లందరూ బాధలు అనుభవించే  ఉన్నత శిఖరాలు అధిరోహించారని, అడ్డదారుల్లో విజయం ఎవరినీ వరించదన్నారు. తానూ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లోనే ఉండి చుదువుకున్నానని, తన తండ్రి, తల్లి రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదన్నారు. ఆకలి, బాధలు, సామాజిక అంతరాలన్నింటినీ దాటుకుని ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఆరోజు అనుభవించిన బాధలు, కష్టాలే నాకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. నేనుపడినటువంటి కష్టాలనుంచి కొంతమంది నైనా దూరం చేయగలగడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. . సమాజాభివృద్ధి,  సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి  చేయడం తన బాధ్యత గా భావిస్తున్నానని చెప్పారు. సికింద్రాబాద్‌ పీజీ కాలేజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ లను అందించడమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి కూడా ఊపిరిగా నిలిచింద న్నారు. ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. భవిష్యత్‌ నిర్మాణంలోనూ విద్యార్థులు, యువతే కీలకమని ఈటల రాజేందర్‌ అన్నారు. రాజకీయమంటే సమాజాన్ని సర్వనాశనం చేసేదని  ఓ అపోహ బలంగా ఉందని,  కానీ తన దృష్టిలో  ఒక వైద్యుడు విఫలమైతే రోగి ప్రాణం పోతుందని, ఇంజినీర్‌ వైఫల్యంతో ఓ నిర్మాణం కూలిపోతుందని, కానీ సామాజిక శాస్త్రవేత్త విఫలమైతే సమాజమే కుప్పకూలుతుందన్నారు. ప్రస్తుతం సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.  యువశక్తిపైనే రాష్ట్ర, దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని, వారికి కావాల్సిన తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కృతనిశ్చయంతో పనిచేస్తూనే ఉంటుందన్నారు. యువత మేధస్సును పెట్టుబడి పెట్టి సమాజ నిర్మాణంలో కలిసిరావాలని  ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa