-రాష్ట్రంలోని 18,405 మంది విఓఎలకు చేకూరనున్న లబ్ధి
-ప్రభుత్వ వాటా రూ.3వేలు, గ్రామైక్య సంఘాలు రూ. 2 వేలు చెల్లించేలా ఆదేశం
-ప్రగతి భవన్లో విఓఎల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మేజర్‌న్యూస్: రాష్ట్రంలోని ప్రతీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి.ఓ.ఎ.)కు నెలకు రూ.5వేల జీతం అందేలాచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గ్రామైక్య సంఘాలు రూ.2వేలు చెల్లించాలని, ప్రభుత్వం రూ.3వేలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తన వాటాను సెర్‌ఫ ద్వారా చెల్లిస్తుందని, గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్ వైజర్లు తీసుకోవాలని ఆదేశించారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వి.ఓ.ఎ.ల వేతనం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో 18,405 మంది విఓఎలు రూ.500 నుంచి రూ.1500వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. ఆయా సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వేతనాలు అందుతున్నాయి. అయితే వీరు చేసే పనికి వస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదని రాష్ట్రంలోని విఓఎలు ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు. గ్రామైక్య సంఘాలు ఇచ్చే డబ్బులతో పాటు ప్రభుత్వం కూడా తమకు కొంత వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో విఓఎలు అప్పటి సమైక్య ప్రభుత్వానికి ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లభించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్లో విఓఏలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి వేతనాలు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవ్వాలని, రాష్ట్రంలోని మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయి. మంచి పేరు వచ్చింది అని తెలిపారు. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడపాలని, గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్ అవసరాలు తీర్చే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు ప్రాసెసింగ్ చేయాలన్నారు. కారంపొడి, పసుపు పొడి, కార, బూంది లాంటి డిమాండ్ ఉన్న వస్తువులను తయారు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa