ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీసా ఉంటే రావచ్చు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:43 AM

 -వీసా ఉంటే నిషేధం నుంచి మినహాయింపు?
 -శ్రీనివాస్‌కు నివాళి అర్పించిన అమెరికన్‌ కాంగ్రెస్‌
 -ఎట్టకేలకు కాన్సస్‌ కాల్పుల ఘటనపై స్పందించిన ్ట్రంప్‌
 -ఇరాన్‌ వాళ్లనుకుని కాల్చాను: ఆడమ్‌ పూరింటన్‌
వలసదారుల అమెరికా ప్రవేశంపై నిబంధనలు సడ లించి అమెరికా అధ్యక్షుడు డొనాల్‌‌డ ట్రంప్‌ కొత్త ఇమ్మి గ్రేషన్‌ ఆర్డర్‌ను తీసుకురానున్నారు. కొత్త ఉత్తర్వుల్లో ఇప్పటికే వీసాలు పొంది ఉన్నవారికి ప్రయాణ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారుల సమాచారం.వాషింగ్టన్‌ : మార్పులతో వస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేసే అవకాశం ఉంది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను, శరణార్థులను అడ్డుకునేందుకు గతంలో ట్రంప్‌ తాత్కాలిక నిషేధం విధించగా, ఫెడరల్‌ కోర్టు ఈ ఉత్తర్వులను అడ్డుకున్న సంగతి తెలిసిందే. మార్పు లుచేసిన నిబంధనలతో న్యాయపరమైన సమస్యలు రాకపోవచ్చని అక్కడి న్యాయ విభాగం లాయర్లు అ భిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త నిబంధనల్లో మతసంబంధ మైనారిటీల శరణార్థి నిషేధంపై ఉన్న మినహాయింపులను తొలగించనున్నట్లు తెలిపారు. ఈ మినహాయింపు వల్ల కేవలం క్రైస్తవ శరణార్థుల ను అమెరికాలోకి అనుమతిస్తున్నారని విమర్శలు వచ్చినందున దీన్నితొలగిస్తున్నట్లు తెలుస్తోంది.కొత్త ఉత్తర్వుల్లో ప్రయాణ నిషేధం ఉన్న దేశాల జాబితా నుంచి ఇరాక్‌ను మినహాయిస్తున్నట్లు కూడా సమా చారం. ఈ విషయాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. దీనిపై స్పందించడానికి వైట్‌ హౌస్‌, న్యాయ విభాగం, ఇతర అధికారులు నిరాక రించారు. అమెరికాలోని కాన్సస్‌ పరిధిలో జాతి విద్వేష హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌కు అమెరికన్‌ కాంగ్రెస్‌ నివాళి అర్పించింది. ఆయన మృతి తమకు దిగ్భ్రాంతి కలిగించిందని చెబుతూ, నిమిషం పాటు మౌనం పాటించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ, ఇటువంటి హత్యలు క్షమార్హం కావని, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పరిపాలన చక్కగా సాగుతోందని కితాబు ఇచ్చుకున్నారు. తన పాలనకు `ఏ' గ్రేడ్‌ ఇచ్చుకుంటున్నానని అన్నారు. తదుపరి బడ్జెట్‌లో రక్షణ రంగానికి మరిన్ని నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.
జాతీయ భద్రతా సలహా సంఘంతో చర్చించి, మరిన్ని నిర్ణయాలు తీసుకు ంటానని వెల్లడించారు. `అమెరికా ఫస్‌‌ట' అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇక్కడి పౌరులందరికీ భద్రత కల్పి స్తామని హామీ ఇచ్చారు. కాన్సస్‌ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనా ల్‌‌డ ట్రంప్‌ ఎట్టకేలకు స్పందించారు. ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లా డలేదంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో చివరికి స్పందిం చారు. అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన 40 రోజుల తరువాత తొలి సారిగా అమె రికన్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్‌.. శ్రీనివాస్‌ హత్యను ఖండిం చారు. దేశంలో ఇటువంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు.  ప్రపంచం లోనే అమెరికా అతి శక్తిమంతమైన దేశమని, అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారికి ఉద్యోగాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే అద్భుతమైన మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు. కంపెనీలు వెనక్కి వస్తున్నాయని పేర్కొన్న ట్రంప్‌ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు చేశారు. ఆయన హయాంలో దేశంలో ఉగ్ర దాడులు పెరిగాయని ఆరోపించారు. ఫిబ్రవరి 22న కాన్సస్‌లోని ఓ బారులో కూచిభొట్ల శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్‌, మరో అమెరికన్‌పై కాల్పులు జరిపిన ఆడమ్‌ పూరిం టన్‌ తాను చేసిన నేరాన్ని జాన్సన్‌ కౌంటీ జిల్లా కోర్టు ముందు అంగీకరించాడు. 51 ఏళ్ల పూరిం టన్‌ను వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, నేరాన్ని అంగీక రించాడు. పూరింటన్‌ తరఫున న్యాయవాదిగా మైఖేల్లె డ్యూరె ట్‌ను నియమి ంచిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.  ఇక వీరి ద్దరూ ఇరాన్‌ జాతీయులై ఉంటారని భావించి కాల్పులు జరిపి నట్టు పూరింటన్‌ వ్యాఖ్యానించి నట్టు బార్‌ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.  మిస్సోరీ ప్రాంతంలోని క్లింటన్‌ ఏరియాలో ఉన్న మరో బారుకు వెళ్లిన పూరిం టన్‌ తాను ఇరాన్‌ జాతీయులను కాల్చి నట్టు చెప్పాడని ఆ ఉద్యోగి తెలిపాడు. పోలీసుల విచారణలో ఇతను కూడా కీలక సాక్షి.  ఈ కేసులో పూరింటన్‌పై అభి యోగాలు రుజువైతే, కనిష్ఠ ంగా 50 సంవత్సరాల జైలు శిక్ష నుంచి మరణ దండన వరకూ శిక్ష పడవచ్చని సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa