ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ భవన్‌లో సీఎం ేకసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన విఓఎలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:46 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః సీఎం కేసీఆర్‌ కు జీవితాంతం రుణపడి ఉంటామని విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు (విఓఎ) తెలిపారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమ కు ఒకే సారి రూ.5వేలకు పెంచడం పై హర్షం వెలిబుచ్చారు. బుధవారం తెలంగా ణ భవన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 18వేల మంది విఓఎల కు సీఎం తీసుకున్న నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల తమ కుటుంబాలకు భరోసా వచ్చిందన్నారు. గ్రామైక్య సంఘాలు ఇచ్చే డబ్బులతో పాటు ప్రభుత్వం కూడా తమకు కొంత వేతం ఇవ్వాలని గత కొంత కాలంగా విఓఎలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా విఓఎలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa