నాల్గో వన్డేలో కివీస్ విక్టరీ
2-2తో వన్డే సీరీస్ సమం
రసవత్తరంగా మారిన ఆఖరి వన్డే
కివీస్ ఖాతాలో అరుదైన రికార్డులు
హామిల్టన్ : సీరీస్‌పై విజయంపై ఆశలు నిలుపుకోవాలంటే... తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విక్టరీ కొట్టింది. ప్రధానంగా ఆ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అజేయ శతకంతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతో పాటు జట్టుకు కూడా సరికొత్త రికార్డు అందించాడు. అంతే కాకుండా సీరీస్ చేజారకుండా న్యూజిలాండ్‌కు అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన గుప్తిల్ అజేయ శతకంతో చెలరేగడంతో కివీస్‌కు ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం దక్కింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 279 పరుగులు చేసింది. కెప్టెన్ డివిలియర్స్ (72), డుప్లిసెస్ (67)లు అర్ధ శతకాలు నమోదు చేయగా, ఓపెనర్ ఆమ్లా (40) పరవాలేదనిపించాడు. అనంతరం 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 45 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బ్రౌన్ లై (4) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయిన కివీస్‌కు మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (180; 138 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్లు) ఆపద్భాందవుడిగా నిలిచి పరుగుల వరద పారించాడు. ఆఖరు వరకు అజేయంగా నిలిచిన గుప్తిల్‌కు కోరీ విలియమ్‌సన్ (21), రాస్ టేలర్ (66) అండగా నిలిచాడు. ఈ క్రమంలో రెండు రికార్డులను కూడా తనఖాతాలో వేసుకున్నాడు. ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గుప్తిల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఛేజింగ్‌లో అత్యదిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో షేన్ వాట్సన్ (185 నాటౌట్), ధోనీ (183 నాటౌట్), కోహ్లీ (183)ల తర్వాత స్థానం గుప్తిల్(180 నాటౌట్) నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు చేసిన న్యూజిలాండ్ క్రికెటర్‌గా కూడా గుప్తిల్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa