మొత్తం రూ. 210 కోట్ల నిధులు మంజూరు చేసిన కేసీఆర్
ఎమ్మెల్యేల జిల్లాల పరిధిని స్పష్టం చేసిన ప్రభుత్వం
ఏడాదికి రూ. 3 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం
తొలి విడతగా ప్రస్తుతం రూ. 1.5 కోట్ల విడుదల
నచ్చిన నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకునేందుకు
ఎమ్మెల్సీలకు వెసులుబాటు: కేసీఆర్ వెల్లడి
నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం నియోజ కవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కలిసి తొలి విడతగా రూ. 210
కోట్ల నిధులను విడుదల చేసింది. దీనిప్రకారం ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ. 1.5 కోట్ల నిధుల చొప్పున విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదికి రూ. 3 కోట్లు చొప్పున కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణ యించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం నాడు ఈ నిధులను ఆయా నియోజకవర్గాల అభివౄఎద్ధికి ఖర్చు చేయనున్నారు. తమకు వచ్చే నిధులను ఎమ్మెల్సీలు తమకు నచ్చిన నియోజక వర్గంలో ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. రాజ్యసభ ఎంపీల తరహాలో వీరు ఈ నిధులను ఖర్చు వివిధ అభి వృద్ధి కార్యక్రమాలకు వెచ్చించొచ్చునని ప్రణాళికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య విడుదలచేసిన ఉత్తర్వులో స్పష్టంచేశారు. దీనితోపాటు రాష్ట్రంలోని 31జిల్లాలు చేసిన అనం తరం ఏ ఏ జిల్లా పరిధికి ఎమ్మెల్యేలు వస్తారన్న దానిపై కూడా స్ప ష్టంగా పేర్కొన్నారు. చేసుకోవచ్చు. ఆదిలాబాద్, బోధ ఎమ్మెల్యేల తో పాటు ఓ ఎమ్మెల్సీ ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోకి రానున్నారు. అలాగే కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు, మంచిర్యాల
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa