హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో ఆస్పత్రి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది.. రోగులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంది. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.