న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ తొలి విడుత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగ్గా, రెండవ విడుత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగనున్నాయి. పలు మంత్రిత్వశాఖలకు సంబంధించిన డిమాండ్లు, గ్రాంట్లపై ఈ సమావేశాల్లో చర్చ జరగనున్నది. జీఎస్టీ విధానాన్ని జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నందున సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లుల్ని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును, శత్రు ఆస్తుల స్వాధీనం బిల్లును ఈ సమావేశాల్లోనే కేంద్రం ప్రవేశపెట్టనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa