ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఇక యూపీలో మొత్తం ఏడుదశల్లో పోలింగ్, మణిపూర్ లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 15 ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఏడో దశ ఎన్నికలు పూర్తి కావటంతో దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఎన్నికల హడావుడికి ఫుల్‌స్టాప్ పడింది. ఏడో దశలో 60 శాతం పోలింగ్ నమోదైంది. ఏడు దశల్లో కలిపి దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైంది. మణిపూర్ లో రెండో దశ పోలింగ్ లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 22 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ పూర్తైంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన వారందరికీ ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.ముఖ్యంగా యూపీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి ఉంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావటంతో ఈ రాష్ట్రంలో గెలుపొందేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. ముఖ్యంగా ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, బీజేపీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కాగా ఎస్పీ, కాంగ్రెస్ కూటమి నుంచి అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ కాళ్లకు బలపం కట్టుకొని తిరిగారు. బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మరోసారి యూపీ అధికారం ఖాయమని అఖిలేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు బీఎస్పీ అధినేత మయావతి సైతం ఎన్నికల్లో పార్టీ తరఫున అంతా తానై ప్రచారం నిర్వహించారు. గెలుపుపై ఆమె ధీమాతో ఉన్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలోనూ విజయం ఎవరినీ వరిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ మొదలైంది. ఈ నెల 11 ఫలితాలు వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa