ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులకు వారాంతపు సెలవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 04:15 PM

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఇక నుంచి వారంతపు సెలవులు పొందనున్నారు. సెలవు లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఉపశమనం కల్పించే దిశగా..వారికి వారాంతపు సెలవును కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. ఈ మేరకు డీజేపీ ఉత్తర్వులు కూడా జారీచేశారు. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు స్థాయి వరకు అందరు పోలీసులు ప్రతీ వారం ఒక రోజు సెలవు దినం కల్పించనున్నట్టు చెప్పారు. పోలీసులకు ఎక్కువ సేపు విధులు నిర్వర్తించాల్సి రావడం, విధుల్లో ఉండే ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.


అయితే అత్యవసర పరిస్థితుల్లో వారంతపు సెలవు ఉండదని, అదే నెలలో పెండింగ్‌లో ఉన్న సెలవును వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులకు ప్రతీ 3 నెలలకోసారి 8 రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించారు. శాంతిభద్రతల కారణాల వల్ల కొన్నిసార్లు వారాంతపు సెలవులు రద్దు చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com