సంగారెడ్డి: పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు 600 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 22 వరకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగనున్నాయి.