హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం బీడీఎల్ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య పద్మజను భర్త కృష్ణారెడ్డి కత్తితో పొడిచాడు. అనంతరం తాను కత్తితో పొడుచుకున్నాడు. వారి అరుపులు విన్న స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. పద్మజ, కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.