జనగామ జిల్లాకు చెందిన పాలకూర్తి డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు. రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. భూమి కొలిచేందుకు ఆర్మీ ఉద్యోగిని సర్వేయర్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం నేరమని ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారలు విజ్ఞప్తి చేశారు.