ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ నెత్తిన చంద్ర‌బాబు గెలుపు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 07:05 PM

ఏపీలో ఇప్పుడిదే చ‌ర్చ‌. ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌తో కేసీఆర్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న‌పుడు ప్ర‌చారానికి వెళ్లిన చంద్ర‌బాబు తెలంగాణ‌లో సెంటిమెంట్ ర‌గిలించేందుకు అవ‌కాశ‌మిచ్చాడు. చంద్ర‌బాబు మ‌ద్ద‌తునిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. మ‌ళ్లీ ఏపీ అదుపాజ్ఞ‌ల్లో బ‌త‌కాల్సి ఉంటుందంటూ కేసీఆర్ అస్త్రంగా మ‌ల‌చుకున్నాడు. బాబు రాక‌తో లాభ‌ప‌డాల‌ని ఆశ‌ప‌డిన కాంగ్రెస్‌ను మ‌రో ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో కూర్చునేందుకు కార‌ణ‌మ‌య్యాడంటూ బాబును విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ పెద్ద‌లూ ఉన్నారు. కూక‌ట్‌ప‌ల్లిలోనూ నంద‌మూరి వార‌సురాలిని గెలిపించుకోలేక‌పోయార‌నే నింద‌ను మోయాల్సిన ప‌రిస్థితి టీడీపీ అధినేత ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అదే కేసీఆర్ ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబునాయుడుకు అస్త్రంగా మారారు. కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రినీ మిత్రులుగా చూపుతూ.. చంద్ర‌బాబు సెంటిమెంట్ పండించే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే కేసీఆర్ అంటే వ్య‌తిరేకంగా ఉన్న ఏపీ ప్ర‌జ‌ల్లో సానుభూతిని ర‌గిలించి.. ఆంధ్రాసెంటిమెంట్‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు చంద్ర‌బాబు మీడియా స‌మావేశాల‌ను బాగానే ర‌క్తిక‌ట్టిస్తున్నారు.
జ‌గ‌న్ గెలిస్తే.. సామంత రాజులుగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఊడిగం చేయాల్సి ఉందుంటంద‌టూ.. నాడు కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను తానూ ప్ర‌యోగిస్తున్నాడు. క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే పిల్లాడు పుట్టిన‌ట్టుగా ఐటీగ్రిడ్స్ డేటా చోరీతో లాభ‌ప‌డాల‌ని భావించిన వైసీపీ కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. తెలంగాణ‌లో చోటుచేసుకున్న ప‌రిణామాలు కుట్ర‌పూరిత‌మంటూ చంద్ర‌బాబు చెప్ప‌టాన్ని ఏపీ ప్ర‌జ‌లు సానుకూలంగా స్వ‌కరిస్తున్నాయి. మీడియా మేనేజ్‌మెంట్‌తో దీన్ని బాబు బాగానే ర‌క్తిక‌ట్టించ‌గ‌లిగారు. అయితే.. దీనిలో టీడీపీ త‌ప్పు ఉంద‌ని నిరూపించాల్సిన బాధ్య‌త వైసీపీ మీద‌నే ప‌డింది. మ‌రోవైపు అశోక్ త‌న‌పై కేసులు కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. అక్క‌డ ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తే వైసీపీ చేతులారా కేసీఆర్ రూపంలో క‌ష్టాన్ని తెచ్చుకున్న‌ట్టుగానే భావించాలి. జ‌గ‌న్‌, మోదీ, కేసీఆర్ త్ర‌యాన్ని బూచిగా చూపుతూ ఆంధ్రుల్లో తెలుగు వారి ఆత్మాభిమానం.. జ‌గ‌న్‌ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను ర‌గిలించ‌టంలో చంద్ర‌బాబు దాదాపు విజ‌యం సాధించిన‌ట్లుగానే పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ విభ‌జ‌న‌పాపం, బీజేపీ హోదా ఇవ్వ‌ని త‌ప్పును కూడా తెలుగుదేశం అనుకూలంగా మార్చుకునేందుకు సామాజిక మాధ్య‌మాల‌ను అనువుగా మార్చుకుంటుంది. పైగా.. జాతీయ‌స్థాయిలో హంగ్ ప్ర‌భుత్వం వ‌స్తే.. చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషిస్తారంటూ టీడీపీ వ‌ర్గాలు అంచ‌నా వేసుకుంటున్నాయి. ఎంపీ సీట్ల‌పై ఇంత‌గా దృష్టి పెట్టడానికి కూడా ఇదే కార‌ణంగా తెలుస్తోంది.


 


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com