హైదరాబాద్: శాసనసభ్యుల కోటా శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రియాజ్(మజ్లీస్), సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.