ప్రస్తుత కాలంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రించే వరకు ఇంటర్నెట్ మనలో ఒక భాగం అయిపోయింది. వరల్డ్ వైడ్ వెబ్ సేవలు ప్రారంభమై నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. అందుకనే సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన సెర్చ్ సైట్లో వరల్డ్ వైడ్ వెబ్ కు చెందిన డూడుల్‌ను ఇవాళ ఉంచింది. మార్చి 12వ తేదీ 1989న టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ ను మొదటి సారిగా అభివృద్ధి చేశారు. అయితే దాని సేవలు మాత్రం ప్రజలకు అందుబాటులోకి 1993 ఏప్రిల్ నెల నుంచి వచ్చాయి. ఈ క్రమంలో టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైబ్ వెబ్‌కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ..నెట్లో వచ్చే తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ వార్తనూ తేలిగ్గా నమ్మవద్దని, మోసపోవద్దని హెచ్చరించారు. ఇంటర్నెట్ వినియిగాదారులు తమ తన డేటాను సురక్షితంగా ఉంచుకోవాలని హితవు పలికారు.