బెంగళూరు : కర్ణాటకలో 24 గంటల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్ప అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 22 సీట్లు బిజెపి గెలిచినపక్షంలో 24 గంటల్లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో బిజెపి 16 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.