శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అధికారులు 810 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు దుబాయి నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.