మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కిష్టంపేట గ్రామంలో మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పర్యటించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలను ఉపయోగించుకోవాలని.. ప్రభుత్వం ప్రతి రైతు పంటను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.