మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మల్లేశ్ ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరాతీసినా.. ఫలితం లేకపోవడం వల్ల భార్య కౌసల్య మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరో మహిళతో వివాహేతర సంబంధం వల్లే తన భర్త కనపడకుండా పోయాడని ఫిర్యాదులో పేర్కొంది.
మారేడ్‌పల్లికి చెందిన మల్లేశ్, కౌసల్య దంపతులు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే మల్లేశ్ కొన్ని నెలల నుంచి ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం కూడా ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోయి 15 రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడు.
వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కౌసల్యతో కలిసి బాగానే ఉన్న మల్లేశ్. 5 రోజుల క్రితం మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భర్త గురించి బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినప్పటికీ ప్రయోజనం లేదు. ఫలితంగా కౌసల్య గురువారం మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. 5 రోజులుగా తన భర్త మల్లేశ్ కనిపించడం లేదని, వివాహేతర సంబంధం వల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.