ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యం పైన ప్రభావం చూపకుండా బరువును తగ్గించే మార్గాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2020, 07:53 PM

అధిక బరువు లేదా స్థూలకాయత్వం గల వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటారు. ఈ ఇబ్బందులను తోలగించుకోటానికి, బరువు తగ్గటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నాలలో ఎవైన లోపాలు ఉండటం వలన బరువు తగ్గలేరు మరియు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ బరువు తగ్గించుకోటానికి పాటించాల్సిన నియమాలు మరియు తీసుకోవాల్సిన ఆహర ప్రణాలికల గురించి పూర్తిగా తెలుపబడింది. వీటిని అనుసరించి మీ బరువు తగ్గించుకోండి..
ఎక్కువగా నీరు త్రాగటం
బరువు తగ్గుటకు ఉన్న సులువైన మార్గం, సోడా వంటి వాటిని తాగటం కన్నా నీరు తాగటం. క్యాలోరీలను అందించే ద్రావణాలు మరియు చక్కెర ద్రావణాల కన్నా ఒక గ్లాసు నీరు తాగటం వలన మీరు ఉత్తేజానికి గురవుతారు. బరువు తగ్గుటకు తయారు చేసుకున్న ఆహర ప్రణాళికలో నీరు తప్పనిసరి అవసరం. నీరు ఎక్కువ తాగటం వలన ఆకలిని తగ్గించి, అధిక ఆహార సేకరణకు దూరంగా ఉంచుతుంది. ఎక్కువగా నీరు తాగటం వలన మీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు మరియు విష పదార్థాలు రెండు భయటకి పంపబడతాయి. అంతేకాకుండా జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.
పని లేదా వ్యాయామాలు
మీ బరువు తగ్గుటలో వ్యాయామాలు ముఖ్య భూమికను పోషిస్తాయి, వ్యాయామాల వలన శరీరంలో కొవ్వు వినియోగం అధికం అవుతుంది. దీని వలన శరీర బరువు తగ్గుతుంది. ఇలా రోజు మీ దిన చర్యలో వ్యాయామాలను ఒక భాగంగా మార్చుకోండి.
ప్రోటీన్ ఆహారాలు
ఎక్కువ ప్రోటీన్'లు ఉన్న ఆహర పదార్థాలను ప్రణాళికలో కలుపుకోవటం వలన జీవక్రియ రేటు పెరుగుతుంది దీని వలన శరీరంలో పెరిగిన కొవ్వు పదార్థాల వినియోగం అధికమై బరువు తగ్గుతుంది.
క్యాలోరీలను తగ్గించండి
ఒక పద్దతి ప్రకారం క్యాలోరీలు తీసుకోటాన్ని తగ్గించటం వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. క్యాలోరీలు తీసుకోటాన్ని తగ్గించటం వలన మీ శరీరంలో నిల్వ ఉన్న క్యాలోరీల వినియోగింపబడి శరీర బరువు కూడా తగ్గుతుంది.
పండ్లు మరియు కూరగాయలు
తాజా పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యానికి పెంపొందించటమే కాకుండా, బరువు కూడా తగ్గిస్తాయి. వీటిని తీసుకోవటం వలన మీ కడుపు నిండినట్టుగా అనిపించి, ఇతర ఆహర పదార్థాల నుండి పొందే క్యాలోరీల స్థాయిలను తగ్గిస్తాయి.
ఆరోగ్యకమైన ఆహర ప్రణాళిక
రోజు ఉదయాన ఆహరం తీసుకోండి, ఉదయాన ఆహరం తీసుకోవటం వలన మధ్యాన్నం మరియు రాత్రి సమయాల్లో తక్కువ ఆహరం తీసుకునే అవకాశం ఉంది. మీ ఆహారాలను సరైన సమయాలలో తీసుకోండి, క్రమ పద్దతి లేని ఆహార నియమాలు మీ ఆరోగ్యాన్ని మాత్రమె కాకుండా బరువు తగ్గటానికి తయారు చేసుకున్న ఆహర ప్రణాళికలు కూడా కలత పరచవచ్చు. కావున మీరు బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నపుడు మీరు తయారుచేసుకున్న ఆహర ప్రణాళికను పాటించాలి. ప్రణాళికలను పాటించటంలో కటినంగా వ్యవహరించాలి. మీ భోజనాలను తప్పకుండా తినండి, భోజనాలను తినకుండా ఉండటం వలన క్యాలోరీలు తక్కువ అవుతాయి నిజమే కానీ బరువు తగ్గుటకు ఇది సరైన మార్గం కాదు దీని వలన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. కావున సరైన ఆహర ప్రణాళికను పాటించి బరువు తగ్గండి.
ఆల్కహాల్ స్థాయిలను తగ్గించండి
అధికంగా ఆల్కహాల్ తీసుకోటాన్ని తగ్గించండి, ఆల్కహాల్ వలన మీ బరువు పెరగటం మాత్రమె కాకుండా శక్తిని కూడా పెంచుతుంది. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకోవటం వలన మీ ఆరోగ్యానికి కూడా హానికరం.
రోజు భౌతిక కార్యకలపాలు, నడవటంతో పాటూ ఆరోగ్యకరమైన ఆహరం వంటివి ఎక్కువ కాలం అనుసరించటం వలన బరువు తగ్గటమే కాకుండా, మీ శరీర దారుడ్యం కూడా పెంపొందించబడి ఆరోగ్యంగా ఉంటారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com