కరోనా రూమర్స్ వల్ల ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఐటీ కంపెనీల అధికారులతో ఆయన మాట్లాడుతూ.. కరోనా పుకార్ల పై వస్తున్న వార్తల పై కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సోషియల్ మీడియ లో ఇలాంటి పుకార్లు రావడంతో విదేశాల్లో ఉన్న హెడ్ ఆఫీస్ ల్లో కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నారున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీల పేర్లు వెల్లడించవద్దన్నారు. ఉద్యోగులు అందరూ భయాందోళనలో ఉన్నారని వెల్లడించారు.