తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…"సీఏఏ పై సభలో ఓ రోజు చర్చిస్తాం. నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు. దళితులకు, పేదవాడికి ఎలా వస్తది. సీఏఏ,ఎన్నార్సీపై ఆందోళన అవసరం లేదు. మేం ఖచ్చితంగా దానిని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే దీని పై దేశమంతా బ్యాడ్ చర్చ జరిగింది. పేదలకు ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు కానీ కట్టలేదు. దళితులకు మూడు ఎకరాలు ఇచ్చి తీరుతాం. డబుల్ బెడ్రూం ఇండ్లు వందకు వంద శాతం కట్టించి తీరుతాం. అప్పులు తెచ్చి కరెంట్ ఇస్తున్నామని కొందరు అంటున్నారు. అది తప్పు. ఆరేళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచలేదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఎక్కడా ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం లేదు. ప్రస్తుతం వాటి పై సమీక్షిస్తున్నాం. కరోనా మన రాష్ట్రంలో లేదు. మన ఉష్ణోగ్రతకు కరోనా వైరస్ బతకదు. కరోనా లేనప్పుడు మాస్కులు ఎందుకు. విదేశాల నుంచి వచ్చిన ఒక్కరికే కరోనా వచ్చింది. అతను కూడా బాగానే ఉన్నాడు. కరోనా గురించి గందరగోళం అవసరం లేదు. ప్రజా దర్బార్ పెట్టి పోడు భూముల సమస్య పరిష్కరిద్దాం." అని సీఎం కేసీఆర్ అన్నారు.