తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం కరోనా బులెటిన్ నిలిపివేతపై విచారణ జరిపిన హైకోర్టు.. కరోనా బులెటిన్ ను ప్రతిరోజూ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఇకపై కరోనా బులెటిన్ ను వారం రోజులకు ఒకసారి విడుదల చేస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.