ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 02:25 PM

బంగారం కొనుగోలు చేయాలని ఆలోచించే వారికి శుభవార్త. పసిడి ధర పడిపోయింది. బంగారం వెలవెలబోతోంది. నిన్న పెరిగిన ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది. వెండి కూడా భారీగా తగ్గిందిది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 దిగొచ్చింది. దీంతో రేటు రూ.47,730కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 తగ్గుదలతో రూ.43,750కు తగ్గింది. బంగారం ధర నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కేజీకి రూ.1,300 క్షీణించింది. దీంతో రేటు రూ.74,400కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1800 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. ఔన్స్‌కు 0.63 శాతం పెరుగుదలతో 28.03 డాలర్లకు ఎగసింది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com