జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో పర్యటించారు. శుక్రవారం నల్గొండ జిల్లాలో పార్టీ కార్యకర్త సైదులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.5 లక్షల సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కీలకాంశాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను నటించిన 'తమ్ముడు' సినిమా పెద్ద హిట్టయిందన్నారు. దీంతో చిత్ర యూనిట్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. అయితే అందుకు కేటాయించిన డబ్బును నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు. దీనికి చిత్రబృందం అంగీకరించిందన్నారు
అప్పట్లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి వస్తే స్థానిక రాజకీయ నాయకులు అడ్డు పడ్డారని వివరించారు. దీంతో ప్రజలకు మేలు చేయాలంటే పక్కా రాజకీయ అండ అవసరమని అర్ధమైందన్నారు. అందుకే 2007 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఆ ఘటన తన మనసులో బలంగా నాటుకుపోవడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ గడ్డపై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానన్నారు.