కొండమల్లేపల్లి మండలంలోని కోర్ర తండా గ్రామానికి చెందిన కో ర్ర వెంకట్రామ్ మృతి బాధాకరమని టీపీసీసీ కార్యదర్శి కొండమల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణు ధర్ రెడ్డి అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ రామ్ శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. వెంకట్ రామ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ర యుగేందర్ కొమ్మ నాయక్ రాజు శ్రీను నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |