పటాన్ చెరువు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, సిబ్బంది సాయంతో గత బుధ, గురువారం పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 16 మందిని గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం సంగారెడ్డి కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా, వారందరికీ ఒక్కొక్కరికి రూ. 2 వేల జరిమానా విధించినట్లు సిఐ తెలిపారు.