జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన వట్కపురం రాజవ్వకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ 18000 విలువ గల చెక్కును సర్పంచ్ గుడిసె శ్రీమతి - జితేందర్ యాదవ్ సోమవారం అందజేశారు. చేట్లపల్లి లచ్ఛవ్వ కు రూ 12. 000, బండారి భూమక్కకు రూ. 10. 000 మొత్తం రూ. 40. 000ల చేక్కులను ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సుచన మేరకు వారి సహాయ సహకారంతో లబ్ధిదారులకు అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూడురి రమేష్, వార్డు సభ్యులు అడేపు సరోజన మల్లేశం, బండారి అనురాధ, ఉయ్యాల శంకరమ్మ, చుంచు ప్రమీల రమేష్, దండికే భాగ్య పాల్గొన్నారు.