ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ముగియనున్న రుద్రాక్షల ప్రదర్శన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 12:27 PM

హన్మకొండ నక్కలగుట్ట లోని హరిత కాకతీయ హోటల్ లో రుద్రాక్షల ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రుద్రాక్షల ప్రదర్శనలో వివిధ ఆకారాలతో కూడిన రుద్రాక్షలు ప్రత్యేక ఆకర్ష ణగా ఉన్నాయి. ఏకముఖి, దక్షి ణావృత శంఖులు, సాలీగ్రాంలు, మరకత శివలింగాలు, అయ్యప్ప రుద్రాక్షల ప్రదర్శన స్వాముల మాలధారలు, పంచముఖి రుద్రాక్ష మాలలు, జపమాలలు, అరుదుగా లభించే రుద్రాక్ష మాలలు, ఐశ్వర్య మాల, కార్యశిద్ధి మాల, గౌరీశం కర్ రుద్రాక్షలు, గణేష్ రుద్రాక్ష, సప్తముఖి లక్ష్మి రుద్రాక్షలు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ వివరించారు. సోమవారం వరకు ప్రదర్శన కొనసాగుతుందని ఆయన తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com