కడెం ప్రాజెక్టు నుండి సుమారు 4, 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టులో 683. 92 నీటి మట్టం ఉందన్నారు. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాలలో వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులోకి ప్రస్తుతం 6, 056 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు నుండి 4, 869 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.