రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు రెండు రోజులు కొనసాగాయి. ఈ దాడుల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఐటీ ఆఫీసర్స్ సీజ్ చేశారు. మల్లారెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లో రూ.18.50 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అలాగే 15 కిలోల బంగారు అభరణాలను ఐటీ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు మరికొన్ని లాకర్స్ ను తెరవనున్నట్లు తెలుస్తోంది. కాగా బంధువులు, అల్లుడి ఇళ్లపై దాడులు చేసిన అధికారులు రూ.10.8 కోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే.