ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:40 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ, జనరల్ సెక్రెటరీ అనిల్ తివారి, సెక్రెటరీ జ్యోతి, ట్రెజరర్ మల్లేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాధ, సంధ్య, లక్ష్మి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com