ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీచర్ల బదిలీల దరఖాస్తుకు గడువు పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:03 PM

ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు సోమవారంతో ముగిసింది. అయితే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువును పెంచారు. షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. టీచర్లు దరఖాస్తు చేసిన తర్వాత హెచ్‌ఎంలు. వాటిని డీఈ వోలకు సమర్పించే మూడు రోజుల కాలపరిమితిని కుదించనున్నారు.


ఈ నెల 28 నుంచి బదిలీల ప్రక్రియ మొదలైనా, తొలి రోజు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందుల వల్ల టీచర్లు తికమక పడ్డారు. కొన్ని ఆప్షన్లు తెరుచుకోలేదు. మరికొన్ని అప్‌గ్రేడ్‌ కాలేదు. మారు మూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలూ ఎదురైనట్టు వార్త లు వచ్చాయి. దీంతో దరఖాస్తు గడువును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com