జడ్చర్లలో మున్సిపల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరై జడ్చర్ల మున్సిపల్ పరిది 23వ వార్డు గౌడ ఫంక్షన్ హాల్ లో మంగళవారం స్వదేశీ హ్యాండీ క్రాఫ్ట్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్పర్సన్ పాలాది సారిక రాంమోహన్, వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్ గౌడ్, ఎంయుడిఏ డైరెక్టర్స్ శ్రీకాంత్, ఇంత్యాజ్, ఏఎంసి డైరెక్టర్ వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు షాప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.